ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం చంద్రబాబు పర్యటనలో జరిగిన రాళ్ల దాడిలో గాయపడి మృతి చెందిన రాజయ్యకు దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో టిడిపి నేతలు టిడిపి జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ గారు, ఇన్చార్జిలు గూడూరి ఎరిక్షన్ బాబు గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఇంటూరి నాగేశ్వరావు గారు నివాళులర్పించారు. టిడిపి అధినేత చంద్రబాబు 10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. వారి కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.