- వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టాలి
- మేనిఫెస్టో అంశాలను అందరికి వివరించాలి
- బూత్ క్లస్టర్ ఇన్చార్జీల సమావేశంలో “పులివర్తి సుధారెడ్డి”
తిరుపతి : అభివృద్ధే లక్ష్యంగా చేసుకుని గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తే 2024లో అధికారం ఖాయమని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. శుక్రవారం రామచంద్రపురం మండలం, కమ్మపల్లి యూనిట్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు రామచంద్రాపురం మండలం అధ్యక్షుడు తిరుమల రెడ్డి అధ్యక్షతన చినబాబు ఆధ్వర్యంలో బూత్, సెక్షన్, క్లస్టర్ ఇన్చార్జీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పులివర్తి సుధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీలు ఉత్సాహంగా పని చేయాలని, దీనికి కన్వీనర్లు ప్రధానంగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. వైసీపీ పాలన పట్ల ప్రజలు విసుగుతో ఉన్నారని, ఈ సమయంలో వారంతా టీడీపీ వైపు ఆకర్షితులయ్యేలా చూడాలన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ మహానాడు వేదికగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను, మిని మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మండలం నాయకులు కార్యకర్తలు, మహిళలు, యువత ,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.