కారంపూడి : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు నచ్చి వైసీపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు టిడిపి నుండి 15 కుమ్మరి కుటుంబాలు మాచర్ల శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో మంగళవారం వైసీపీలో చేరారు. వారికి ఆయన వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తన మీద నమ్మకంతో వైసీపీలోకి వచ్చిన కుమ్మరి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడ సమస్య లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి వస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి వారికి నేను న్యాయం చేశానన్నారు. కొంతమంది వ్యక్తులు టిడిపిలోకి వెళుతూ ఈసారి టిడిపి వస్తే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మనల్ని క్షమించడు, వైసిపి వస్తే మరల పిన్నెల్లి దగ్గరికి వచ్చి పనులు చేయించుకోవచ్చు, రామకృష్ణారెడ్డి క్షమిస్తాడు అని మాట్లాడుతున్నారని అంటే మంచితనాన్ని కూడా ఇలా వాడుకుంటారా అలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. వైసీపీ పార్టీలో ఉన్న కుమ్మరి సోదరులందరికీ నా ప్రాణం ఉన్నంత వరకు ఏమి ప్రాబ్లం వచ్చిన తోడుగా ఉంటానని తెలిపారు. కచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు రెట్టింపు స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అందిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కారంపూడి యూత్ లీడర్ చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి, దొంత అంజి, బొంకూరి నాగేశ్వరరావు, పలువురు కుమ్మరి కుటుంబ సభ్యులు ఉన్నారు.