- 2025 సంవత్సరం బీసీల నామ సంవత్సరంగా గుర్తింపు పొందింది…..
- బీసీలను అత్యున్నత పదవులు నియమించడం ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం
- జగన్ ప్రభుత్వంలో బీసీలపైన దాడులు, అణిచివేత
తిరుపతి : 2025 సంవత్సరం బీసీల నామ సంవత్సరంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిందని ఎందుకంటే భారతదేశ, రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఒక సంచలనం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వములో బీసీలపై అణచీ వేస్తే, బీసీలపైన దాడులు చేసి, బీసీలపైన ఉక్కు పాదం మోపితే, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బీసీలకు ప్రభుత్వ పదవుల్లో పెద్దపీట వేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడం జరిగిందని, రాష్ట్ర డిజిపిగా బీసీ సామాజిక వర్గం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర, శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్ మోస్ట్ బీసీ నాయకులను నియమించి బీసీలను అత్యున్నత గౌరవం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు. రానున్న రోజుల్లో కూడా బీసీలకు తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానం లభిస్తుందన్నారు. చీఫ్ సెక్రటరీగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడంతో రాష్ట్రవ్యాప్తంగా బీసీలలో పండుగ వాతావరణం నెలకొందని, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సీనియారిటీని గౌరవించకుండా ,అధికార దర్పంతో తన సొంత సామాజిక వర్గాని వారికి ఉన్నత పదవులను కట్టబెట్టడం జరిగిందని. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు! బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ! అని మరొకసారి చంద్రబాబు నాయుడు నిరూపించారన్నారు. అందుకనే 2025 సంవత్సరాన్ని, బీసీల నామ సంవత్సరంగా ప్రకటించారు అన్నారు. ఈ సమావేశంలో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ ,జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మేషాక్, జిల్లా వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి గోపాల్, టిడిపి నాయకులు బాలకృష్ణ నాయుడు, టిడిపి నాయకులు సురేషు, కరుణాకర్, శ్రీరాముల నాయుడు, శరవణ, గోవిందరాజులు, సురేష్ కుమార్ పాల్గొన్నారు.