contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎపి స్పీకర్ తమ్మినేనిపై ఓ రేంజిలో విరుచుకుపడిన నారా లోకేశ్

ఎపి / శ్రీకాకుళం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డమా బుస్సు ఎమ్మెల్యే అంటూ తమ్మినేనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014 తర్వాత ఆముదాలవలస నియోజకవర్గాన్ని టీడీపీ ఎంతో అభివృద్ధి చేసిందని, కానీ 2019లో ప్రజలు ఇక్కడ డమా బుస్సు ఎమ్మెల్యేని గెలిపించారని లోకేశ్ వెల్లడించారు. అందుకు మనం కూడా కారణమే… నాడు మనం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం అని వివరించారు.

“ఈ డమా బుస్సు ఎమ్మెల్యే అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చెబుతుంటాడు… తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరేనని అంటుంటాడు. ఈ డమా బుస్సును అడుగుతున్నా… అదే ఎన్టీఆర్ కుమార్తెను శాసనసభ సాక్షిగా అవమానిస్తే నువ్వు పీకిందేంటి? చేసిందేంటి? ఇవాళ శాసనసభకు కనీస గౌరవం లేదంటే అందుకు కారణం ఈ డమా బుస్సు ఎమ్మెల్యే.

వాస్తవానికి 2019కి ముందు తమ్మినేని సీతారాంను నేను చాలా గౌరవించాను. ఎప్పుడైతే శాసనసభ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ, ప్రతిపక్ష నేతను అవమానిస్తుంటే పట్టించుకోలేదో, ఆ రోజే ఆయన గౌరవం పోగొట్టుకున్నాడు.

ఈ డమా బుస్సు ఎమ్మెల్యే అవినీతిలో పలాస ఎమ్మెల్యే కొండలరాజుతో పోటీ పడుతున్నాడు. ఐదేళ్లలో ఎవరూ ఊహించనంతగా రూ.1000 కోట్లు సంపాదించాడీ డమా బుస్సు ఎమ్మెల్యే. లాండ్, శాండ్, మైన్ అన్నింటికీ ఆముదాలవలసను అడ్డాగా మార్చేశాడీ డమా బుస్సు ఎమ్మెల్యే. కొడుకు పెళ్లి జరిగితే కాంట్రాక్టర్లను వేధించి రూ.1.30 కోట్లు వసూలు చేశాడు.

కేవలం ఇసుకలోనే రూ.300 కోట్లు స్వాహా చేశాడు. వాలంటీరు పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, షిఫ్టు పోస్టులు సొంత కార్యకర్తలకు కాదు కదా, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఇచ్చాడు ఈ డమా బుస్సు ఎమ్మెల్యే” అంటూ లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.

నారా లోకేశ్ శంఖారావం వివరాలు
ఉమ్మడి శ్రీకాకుళం – ఉమ్మడి విజయనగరం జిల్లాలు
13-2-2024 (మంగళవారం) కార్యక్రమ వివరాలు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా

పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
10.15 – శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రసంగం.
10.20 – శ్రీకాకుళం పార్లమెంట్ జనసేన అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ ప్రసంగం.
10.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.30– శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రసంగం.
10.32– పాతపట్నం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ గేదెల చైతన్య ప్రసంగం.
10.34– పాతపట్నం టీడీపీ ఇంఛార్జ్ కలమట వెంకటరమణ ప్రసంగం.
10.36– పాతపట్నం శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా బాబు సూపర్ – 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీకేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
1.05 – నారా లోకేశ్ పాలకొండ చేరిక.
1.05 – పాలకొండ పట్టణంలో భోజన విరామం.

పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.15 – అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్ ప్రసంగం.
2.20 – ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ ప్రసంగం.
2.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
2.32– పాలకొండ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ నిమ్మల నిబ్రం ప్రసంగం.
2.34– పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ నిమ్మక జయకృష్ణ ప్రసంగం.
2.36– పాలకొండ శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
2.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
3.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.
3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.29 – పార్టీకేడర్ తో లోకేశ్ సెల్ఫీ.
4.30 – కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి నారా లోకేశ్ చేరిక.

ఉమ్మడి విజయనగరం జిల్లా
కురుపాం నియోజకవర్గం
సాయంత్రం
4.45 – అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్ ప్రసంగం.
4.50 – విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగమాధవి ప్రసంగం.
4.55 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.02 – కురుపాం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ ప్రసంగం.
5.04 – కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి తోయక జగదీశ్వరి ప్రసంగం.
5.06 – కురుపాం శంఖారావంలో నారా లోకేశ్ ప్రసంగం.
5.26 – పార్టీ కార్యకర్తలతో లోకేశ్ ముఖాముఖి.
5.56 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
5.58 – టీడీపీ కార్యకర్తలచే లోకేశ్ ప్రతిజ్ఞ.
5.59 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా పార్వతీపురం ప్రయాణం.
6.30 – పార్వతీపురం చేరుకుని, అక్కడ బస చేస్తారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :