contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

TDP vs YCP: రణరంగంగా మారిన పుంగనూరు .. వైసీపీ, టిడిపి రాళ్ళ దాడి !

టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు టూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీటీడీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

టీటీడీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన ఉద్రిక్తతల మధ్య నడుస్తోంది. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించగా… వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు యత్నించాయి. చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో ఒక్కసారిగా వైసీపీ-టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఫలితంగా అక్కడంతా హైటెన్షన్ వాతారణం నెలకొంది.

టీడీపీ, వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఇందులో పలువురికి గాయలయ్యాయి. ఈ ఘటనలో ఓ పోలీస్ వాహనం ధ్వంసమైంది. అంతేకాకుండా… చాలా ప్రైవేటు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడి జరగటంతో… చంద్రబాబు ఎన్ఎస్ జీ కమాండోలు అప్రమత్తమయ్యారు. బుల్లెట్ ఫ్రూప్ ని ఓపెన్ చేశారు.

పోలీసులపై కురిసిన రాళ్ల దాడిలో గాయపడిన పాలసముద్రం ఎస్ఐ ప్రసాద్, దిశ డిఎస్పీ ప్రసాద్, సీసీఎస్ సీఐ బాస్కర్, రెండు పోలీసు వాహనాలు దగ్దం.

పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఫైర్…

మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. “పెద్దిరెడ్డీ! నువ్వూ నీ అనుచరులు కర్రతో వస్తే నేను కర్రతో వస్తా.. నువ్వు యుద్ధం ప్రకటిస్తే నేను యుద్ధం ప్రకటిస్తా.. నీ పతనం ప్రారంభమైంది” అంటూ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే రా తేల్చుకుందామని సవాల్ విసిరారు. వైసీపీ శ్రేణులతో పాటు… పోలీసులను తీవ్రస్వరంతో హెచ్చరించారు. గాయాలపాలైన పార్టీ శ్రేణులకు ప్రాథమికచికిత్స చేసి, వెంటనే ఆసుపత్రికి తరలించాలని చంద్రబాబు సూచించారు.

“ఇక్కడున్న ఎమ్మెల్యే రావణాసురుడిని మించిపోయాడు. ఒళ్లు దగ్గరపెట్టుకొని ప్రవర్తించు ఎమ్మెల్యే. నిన్ను వదిలిపెట్టను. మీరు మర్యాదగా ఉంటే మేం మర్యాదగా ఉంటాం. మీరు యుద్ధం ప్రకటిస్తే మేం యుద్ధం ప్రకటిస్తాం. ఏయ్ పెద్దిరెడ్డి.. రోజులు గుర్తుపెట్టుకో. నా కార్యకర్తలు, మా నాయకుల నుంచి వచ్చిన ప్రతి రక్తపుబొట్టు నా రక్తపు బొట్టుతో సమానం. మేం ఏం తప్పుచేశామని నీ గూండాలతో దాడి చేయిస్తున్నావు? అంగళ్లు గ్రామానికి పోకూడదా? పులివెందుల గడ్డపైకి వెళ్లాను.. నువ్వెంత? నా దగ్గర వేషాలేయకండి. నేను చిత్తూరుజిల్లాలోనే పుట్టాను. ఇక్కడి నీళ్లే తాగి, ఇక్కడేపెరిగాను. ఎంత అహంకారముంటే తెలుగుదేశం జెండాలు చించుతారు? మీరు మగాళ్లయితే పోలీసులు లేకుండా రండి. పోలీసులూ మీ వల్ల కాకపోతే తప్పుకోండి. ఒక్కడిని అదుపుచేయలేకపో తున్నారు…మీరేం పోలీసులు? నన్నే రమ్మంటారా చెప్పండి? డీఎస్పీ నీకు చేతగాకపోతే యూనిఫామ్ తీసేయ్. వాడెవడో పిల్లకుంక ఒకరాయి వేస్తే భయపడతామా? మనం ఎవరిజోలికి పోము తమ్ముళ్లు.. ఎవరైనా మనజోలికి వస్తే వదిలిపెట్టొద్దు. పుంగనూరు పోయి తేల్చుకోవడానికి సిద్ధమే. నా మీదనే దాడిచేసిన ఈ దుర్మార్గులు ప్రజల్ని వదిలిపెడతారా? ప్రజలారా ఆలోచించండి. మీ భూముల..ఆస్తులు.. ప్రాణాలు ఏవీ వదిలిపెట్టరు. మా ప్రాణాలు మాకెంత ముఖ్యమో.. మీ ప్రాణాలు మీకు అంతే ముఖ్యమని తెలుసుకోండి. రాజకీయాలంటే వీళ్ల తాత జాగీరా? అంటూ చంద్రబాబు ఘాటుగా మాట్లాడారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :