అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా దీనిపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.