టీడీపీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బుధవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని లోకేశ్ నివాసంలో జరిగిన ఈ భేటీలో పల్నాడు జిల్లాలో పార్టీ స్థితిగతులపై కీలక చర్చ జరిగింది. ప్రత్యేకించి గురజాల, మాచర్ల నియోజకవర్గాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.
వైసీపీ ప్రభుత్వంపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని టీడీపీ ఓటుబ్యాంకుగా మార్చునే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని యరపతినేని చెప్పారు. ఈ దిశగా పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ఆయన నారా లోకేశ్‌కు సూచించారు.
ఈ రోజు హైదరాబాదులో సాయంత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల రెండు నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితులు వివరించడం జరిగింది. (1/2) pic.twitter.com/6vT871urYh
— Yarapathineni Srinivasarao (@Yarapathineni_S) May 17, 2022