హైదరాబాద్ : తెలంగాణ సినీ మరియు టివి కార్మికుల పలు సమస్యల పై తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కార్మికులకు చిత్రపురి కాలనిలో నివాస గృహాలు దక్కలేదని నేటికీ ఎంతోమంది సినీ కార్మికులకు సరైన గృహ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదురుకొంటున్నారు కావున ప్రభుత్వం వారు దయతలిచి పేద సినీ కార్మికులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలనీ కోరారు. తెలంగాణ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షురాలు కవితా ఝాన్సీ మాట్లాడుతూ తెలంగాణ యూనియన్లలో ఉన్నటువంటి సభ్యులకు పనులు లభించడం లేదని, తెలంగాణ కార్మిక సంఘాల సభ్యత్వాలు చెల్లవని కొందరు దుష్ప్రచారం చేస్తూ, వచ్చిన అవకాశాలను కూడా పోగొడుతున్నారని అసలు తెలంగాణ యూనియన్లకు అస్తిత్వమే లేదని, తెలంగాణ కార్మిక సంఘాలలో ఉన్న కార్మికులను మనోవ్యధకు గురిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ సినీ కార్మికుల సమస్యల పై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి, ట్రెజరర్ ఠాగూర్, తెలంగాణ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షురాలు కవితా ఝాన్సీ , ట్రెజరర్ పరశాంత్ కుమార్ , కార్మిక సంఘాల నాయకులు , సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
