హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 12వ తేదీ నుంచి నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 లేదా వారం రోజుల పాటు జరిగే ఈ సమావేశాలపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సమావేశాల్లో చర్చించనున్నారు. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం, గవర్నర్ తీరు, గవర్నర్ రీ కాల్ పై చర్చ అలాగే ఐటీ, ఈడీ, సీబీఐ దాడులపై కూడా సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.