contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అసెంబ్లీలో బిల్లులు ఆమోదించే ప్రక్రియలో తనకు విస్తృత అధికారాలున్నాయన్న గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆమె మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదని ఆమె అన్నారు. బిల్లులను ఆమోదించే అంశంలో తనకు విస్తృతమైన అధికారాలు ఉంటాయని చెప్పారు. తన పరిధికి లోబడి తాను నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు.

తాను ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున తనను జెండాను ఆవిష్కరించనివ్వలేదని ఆమె విమర్శించారు. తాను ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని చెప్పారు. రాజ్ భవన్ లో తనకు అయ్యే ఖర్చును సొంతంగా భరిస్తున్నానని, ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకోవడం లేదని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :