హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ ఆఫీసర్ శాంతి కుమారి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి 2025, ఏప్రిల్ వరకు కొనసాగనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శాంతి కుమారి.. గతంలో సీఎం కార్యాలయంలో పని చేశారు.తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా శాంతి కుమారి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. సీఎంవోలో స్పెషల్ ఛేజింగ్ సెల్ బాధ్యతలను కూడా నిర్వహించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న మెదక్ కలెక్టర్‌గా కూడా శాంతి కుమారి సేవలందించారు.
