contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీస్ స్టేషన్ లో.. లాకప్ డెత్… !

నల్లగొండ జిల్లా: ఇద్దరు అన్నదమ్ములు మధ్య ఏర్పడిన భూ వివాదంలో ఓ ఎంపీటీసీ జోక్యం చేసుకుని,తమ్ముడితో అన్నపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించి,ఎస్ఐకు భారీగా ముడుపులు చెల్లించి దగ్గరుండి విచక్షణా రహితంగా కొట్టించి 60 ఏళ్ల గిరిజన వ్యక్తి లాకప్ డెత్ చేసి, ఎంపిటిసి, ఎస్ఐ పరారైన ఘటన ఆదివారం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.

నల్లగొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామ గ్రామపంచాయతీలోని పాలెం తండాకు చెందిన సొంత అన్నదమ్ములు నేనావత్ సూర్య నాయక్, నేనావత్ బీమా నాయక్.వీరి మధ్య భూమి విషయంలో పంచాయితీ జరిగింది.

ఈ విషయంలో జోక్యం చేసుకున్న ఎంపిటిసి వసంత్ నాయక్ తమ్ముడు బీమాతో అన్న సూర్యా నాయక్ పై చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించాడు.ఎంపిటిసి మాటలు విని ఎస్ఐ సతీష్ రెడ్డి సూర్య నాయక్ ను విపరీతంగా కొట్టడంతో స్టేషన్ లోనే స్పృహ తప్పి పడిపోయాడు.

అతనిని హడావుడిగా దేవరకొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని పోలీసులు తమకు చెప్పారు.అయితే సూర్య నాయక్ మార్గమధ్యలో చనిపోలేదని,పోలీస్ స్టేషన్ లోనే లాకప్ డెత్ చేశారని, బీమా నాయక్ వద్ద భారీగా ముడుపులు తీసుకొని ఎస్ఐ సతీష్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడని,దానికి ఎంపిటిసి సహకరించాడని,అందుకే ఇద్దరూ పరారీలో ఉన్నారని ఆరోపిస్తున్నారు.చింతపల్లిలో ఉంటే పోలీస్ స్టేషన్ పై మృతదేహంతో దాడికి దిగుతారనే దేవరకొండకు తరలించి, పోలీస్ స్టేషన్ ఎవరూ లేకుండా పరారయ్యారని,దేవరకొండ ఆసుపత్రిలో మార్చురీలో మృతదేహాన్ని ఉంచి,తాళం వేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని,కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి వరకు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.పోలీస్ స్టేషన్ లోనే ఓ గిరిజన వ్యక్తిని లాకప్ డెత్ చేసిన ఎస్ఐ సతీష్ రెడ్డిని ఉద్యోగం నుండి డిస్మిస్ చేసి,అతనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,అతనికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేసి,ఈ మృతికి కారణమైన ఎంపిటిసి వసంత్ నాయక్,కేసు పెట్టిన బీమా నాయక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు,బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

ఏమాత్రం రాజ్యాంగం,చట్టం మీద గౌరవం లేకుండా,అగ్రకుల అహంకారంతో గిరిజన బిడ్డను క్రూరంగా హింసించి లాకప్ డెత్ చేసి పరారైతే కనీసం పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ చేస్తే స్పందించే పరిస్థితి లేదని, పోలీసులు ప్రజలకు రక్షకులా భక్షకులా అర్దం కావడం లేదని గిరిజన ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ కిషన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పరారీలో ఉన్న ఎస్ఐ సతీష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చింతపల్లి పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్...

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :