సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో సిద్దిపేట జిల్లా బీసీ మోర్ఛ కార్యదర్శి బుర్ర మల్లేశం గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగాబుర్ర మల్లేశం గౌడ్ మాట్లాడుతూతెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పలు సందర్భాలలో పేర్కొంటూ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎంఐఎం పార్టీకి భయపడి ఓట్ల రాజకీయంతో “జాతీయ సమైక్యత దినంగా ” సెప్టెంబర్ 17ను జరపడం సిగ్గుచేటనిమండిపడ్డారు. కెసిఆర్ ఒక ఉద్యమ నాయకుడు,తెలంగాణ విమోచన ఎలా జరిగిందో నిజాం నిరంకుశ పరిపాలన లో భూమికోసం, భుక్తి కోసం,పీడన విముక్తి కోసం, ఎందరో తెలంగాణ వీరులు అమరమరణం పొందారని మరిచారా అనిఅన్నారు. బైరాన్ పల్లి ఘటనను మరిచారా!సాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వీరమరణాలు గుర్తుకు రావడం లేదా, అని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోబిజెపి గ్రామ బూత్ సభ్యులు జంగిటి వెంకట్ రెడ్డి, గొడుగు సంపత్, బుర్ర క్రాంతి కుమార్ గౌడ్ కొరివి రాజేందర్ బుర్ర సాయి కృష్ణ గౌడ్, గ్రామస్తులు మెకానిక్ మల్లేశం, అంతెల్ల సంపత్, పట్నం కొమురయ్య,తదితరులు పాల్గొన్నారు.
