హ్యూస్టన్:- అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు అమ్మాయి మృతి చెందింది. టెక్సాస్‌లోని డల్లాస్‌కు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెన్ ప్రీమియర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటన లో 8 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్య కూడా మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా , మిర్యాలగూడ అని సమాచారం.
