తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 5వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు కృష్ణాపురం టోల్ గేట్ విడిది నుంచి ఈనాటి పాదయాత్ర ప్రారంభమయింది. ఈరోజు పలు గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి నారా లోకేశ్ కమ్మనపల్లె వద్ద ఉన్న కస్తూరిబా స్కూల్ లో బస చేయనున్నారు.
యువగళం పాదయాత్ర 5వ రోజు షెడ్యూల్:
ఉదయం 8.00 గంటలకు కృష్ణాపురం టోల్ గేట్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం
10.30 గంటలకు కస్తూరి నగరం క్రాస్ వద్ద గౌడ (తమిళ్) సామాజికవర్గంతో సమావేశం
11.40 గంటలకు కైగల్లు గ్రామం వద్ద యాదవ సామాజికవర్గ ప్రతినిధులతో భేటీ
మధ్యాహ్నం 12.30 గంటలకు దేవదొడ్డి గ్రామంలో కురుబ/కురుమ సామాజికవర్గం వారితో ముఖాముఖి
సాయంత్రం 4.25 గంటలకు బైరెడ్డిపల్లె పట్టణం రాయల్ మహల్ లో బీసీ కమ్యూనిటీతో సమావేశం
5.15 గంటలకు బైరెడ్డిపల్లె పట్టణంలో తెలుగుదేశం జెండా ఆవిష్కరణ
రాత్రి 6.55 గంటలకు కమ్మనపల్లె సమీపంలోని కస్తూరిబా స్కూల్ విడిది కేంద్రంలో బస.