contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుడిని ఆక్రమించి ఇళ్ళు కట్టేసారు .. 45 ఏళ్ల తరువాత శివాలయం రీఓపెన్

ఉత్తరప్రదేశ్: సంభాల్‌లోని ఖగ్గు సరాయ్ ప్రాంతంలో 1978 నుండి కనిపించకుండా పోయిన ఓ శివాలయం 45 ఏళ్ల తర్వాత తిరిగి తెరవబడింది. ఆలయం ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించి కొందరు ఇళ్లు నిర్మించుకోవడమే అందుకు ప్రధాన కారణం.

కొందరు ఆలయాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నట్లు సర్వేలో తేలిందని.. ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని సంభాల్‌ అడిషనల్ ఎస్పీ శ్రీశ్‌చంద్ర మీడియాకు వెల్లడించారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేసినట్లు ఆయన తెలిపారు. గుడిలో శివుడు, హనుమంతుడు విగ్రహాలు ఉన్నట్లు వివరించారు. ఆలయాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో ఈ ప్రాంతంలో హిందూ కుటుంబాలు నివసించేవారని, కొన్ని కారణాల వల్ల వారు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారని పేర్కొన్నారు.

అదే విధంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లో దేవావలయాన్ని ఆక్రమించి పెద్ద కాంప్లెక్స్ నిర్మించాలని, అందులో ఇంటర్నేషనల్ ఛానల్ స్థాపించాలని ప్రయత్నాలు జారుతున్నాయని ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంతేకాక ఇప్పటికే కొంత భాగాన్ని ఆక్రమించి కొంత నిర్మాణం జరిగినట్టు సమాచారం. హిందూ దేవాలయం పై జరుతున్న ఆంధ్రోళ్ల కుట్ర బట్టబయలు కానుంది.

Hyderabad : Is the Hindu temple being encroached upon?

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :