డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడంతో ప్రిపేర్ అయ్యేందుకు సమయం లేదని.. ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత వాతవరణం నెలకొంది.
నిరుద్యోగ సంఘాల పిలుపు మేరకు సాయంత్రం నుంచే గ్రంథాలయానికి గ్రూప్స్, డీఎస్సీ పరీక్ష అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. గ్రూప్ 2, 3, డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అప్పటికే పోలీసులు బలగాలు భారీగా లైబ్రరీ వద్దకు చేరుకున్నాయి.
చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ర్యాలీగా బయలుదేరేందుకు నిరుద్యోగుల ప్రయత్నం చేస్తుండగా వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. నిరుద్యోగులతో పోలీస్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో లైబ్రరీ వద్ద హై టెన్షన్ వాతవరణం నెలకొంది.