contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగించారు. కాగా.. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే.. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయ్యారు.

జస్టిస్ సుజయ్ పాల్ 1964 జూన్ 21న జన్మించారు. ఆయన బీకాం, ఎంఏ, ఎల్ఎల్‌బీ విద్యను పూర్తి చేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం.. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, ఇతర బోర్డులకు తన సేవలను అందించారు. 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సుజయ్ పాల్.. 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసుతో 2024 మార్చి 21న ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. కాగా.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవటం గమనార్హం

ఇదిలా ఉంటే.. జస్టిస్‌ అరాధే తెలంగాణ హైకోర్టులు 18 నెలల పాటు సేవలు అందించారు. 2023 జులై 19న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాధే నియమితులయ్యారు. జులై 23న పదవీ ప్రమాణంచేసి బాధ్యతలు చేపట్టారు. 1964 ఏప్రిల్‌ 13న రాయ్‌పుర్‌లో జన్మించిన జస్టిస్‌ ఆలోక్ అరాధే.. 1988 జులై 12న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. జబల్‌పుర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ కొనసాగించారు. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2011 ఫిబ్రవరి 15న అక్కడే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

2016 సెప్టెంబరు 20న జమ్మూ కశ్మీర్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2018 మే 11న ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నవంబరు 17న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2022 జులై 3 నుంచి అక్టోబరు 14 వరకు ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. బెంగళూరు మీడియేషన్‌ సెంటర్, కర్ణాటక జ్యుడిషియల్‌ అకాడమీ, ఆర్బిట్రేషన్‌ అండ్‌ కన్సీలియేషన్‌ సెంటర్‌ల ప్రెసిడెంట్‌గానూ సేవలందించారు. అక్కడి నుంచి పదోన్నతిపై బదిలీ అయి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :