- మినీ అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు మాంకాలి రాజేశ్వరి
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం: మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీలుగా అప్ గ్రేడ్ చేస్తూ జీఓ జారీ చేసిన సీఎం కెసిఆర్ కు మినీ అంగన్వాడి టీచర్ల జిల్లా అధ్యక్షురాలు మహంకాళి రాజేశ్వరి ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గత ఎనిమిది ఏండ్లుగా మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ (బిఆర్ టి యు అనుబంధం)రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మీ సారథ్యంలో సామరస్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాల ద్వారా పలు సార్లు విన్నవించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 3989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ లుగా అప్గ్రేడ్ చేసి, కేంద్రానికి అప్గ్రేడ్ జీఓ ను పంపిన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మినీ అంగన్వాడి టీచర్లకు సహకరించిన మంత్రి సత్యవతి రాథోడ్,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు. టీచర్ విధులు, ఆయా విధులు రెండు నిర్వర్తిస్తూ అదనంగా ప్రభుత్వం ఇస్తున్న బిఎల్ఓ డ్యూటీ,ఎన్ హెచ్ డి పల్స్ పోలియో లాంటి ఎన్నో పనులు చేస్తూ కష్టాలను ఎదుర్కొన్నామని, ప్రభుత్వం గుర్తించి మెయిన్ అంగన్వాడీ లుగా అప్గ్రేడ్ చేసినందుకు పరమేశ్వరి, సరిత, కవిత, గాయత్రి,రజిత,నిర్మల, రజిత, శ్రావణి,తిరుమల, రజిత, అంజలి,లలిత,లీల సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.