పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ,ది రిపోర్టర్ న్యూస్ : జూన్ 16 మరియు 17వ తేదీల్లో గిరిజన సంఘం 7వ జిల్లా మహా సభలు కురుపా గ్రామంలో జరుగు సందర్భముగా జిల్లాలో గల అన్ని మండలాల్లో ఉన్న గిరిజను లందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ కొమరాడ మండలం దేవకొన పంచాయితీ, ఆంటీ వలస గ్రామంలో గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం జిల్లా కమిటీ నాయకులు యు.వెంకటేష్ ఆధ్వర్యంలో మహాసభకు సంబంధించిన గోడ పత్రికలు పట్టుకొని గ్రామంలో ప్రచారం ర్యాలీ పోస్టల్ పట్టుకొని శనివారం చేయడం జరిగింది. అనంతరం గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ…. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు గాను చాలా అన్యాయం చేసే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో గిరిజనులకు అన్యాయం చేస్తూ ఊరుకునేది లేదని కావున గిరిజన హక్కులను కాలరాసే విధంగా లక్షలాదిమంది గిరిజనకు సంబంధించిన చట్టాలను ఎత్తివేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉందని కావున ఈ లాంటి సందర్భంలో కురుపాం నియోజకవర్గ కేంద్రంలో జూన్ 16 17 తేదీల్లో గిరిజన సంఘం మన్యం జిల్లా 7 వ మహాసభలు కురుపాములో జరుగుతున్న సందర్భంగా గిరిజన హక్కులను చట్టాలను కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఎత్తివేస్తు న్నారని జీవో నెంబర్ 3 ని సుప్రీంకోర్టు రద్దుచేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని అలాగే 1/70చట్టాన్ని ఎత్తివేసి గిరిజనుల భూములు అడవి భూములు ఈరోజు ప్రధానమంత్రి అయిన గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ పెట్టుబడుదలకు అప్పజెప్పడానికి చూస్తున్నారని అన్నారు,
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చి గిరిజనులను అడవిలో కి వెళ్ళనివ్వకుండా బ్రిటిష్ కాలం నాటి చట్టాల కంటే ఘోరమైన చట్టాలను తీసుకువచ్చి అటవీ ఉత్పత్తులు గాని కర్రలు గాని జీవనోపాధికి సంబంధించిన ఏ ఆధారాన్ని గిరిజనులు అడవి నుంచి పొందకుండా పటిష్టమైన చట్టాలు చేస్తున్నారని అన్నారు, అలాగే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి గిరిజనులకు చదువు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పన్నాగం పన్నుతున్నారని దానికి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకరి స్తున్నాడని అన్నారు,మైనింగ్ పేరుతో కొండలన్నీ కార్పొరేట్ పెట్టు బడి దారులకు అప్పజెప్పి గిరిజనులని కొండల మీద హక్కులు లేకుండా చేయడానికి చూస్తున్నారని,
ఈ దుర్మార్గాలన్నిటిని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరి స్తుందని అన్నారు,కాబట్టి గిరిజనులు అంతా గిరిజనులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న తరుణంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ఇంకా కొన్ని తీర్మానాలు చేయవలసిన అవసరం ఉందని కావున ఆ దిశగా జూన్ 16 మరియు 17 తేదీల్లో కురుపాంలో జరిగే జిల్లా ఏడవ మహాసభలను జయప్రదం చేయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజలు లక్ష్మమ్మ మంగమ్మ సుబ్బారావు, సత్య రావు, సన్యాసిరావు, రామారావు,ప్రసాదు, వెంకటేశు, లక్ష్మణరావు,గిరిజనులు పాల్గొన్నారు.