- వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నేలవాలిన వరి, మక్కజొన్న పంటలు
- ఆదివారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
- ఆదివారం అర్ధరాత్రి కూడా వడగండ్ల వాన కురవడంతో పొలాల్లో నేలకొరిగిన వరి పంటలు
- కల్లాల్లో తడిసిన వడ్లు, మక్కలు, మిర్చి నేలరాలిన మామిడి కాయలు
- యాసంగి పంటలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆదివారం అర్ధ రాత్రి కురిసిన అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది.
- కల్లాల్లో రైతులు ఆరబెట్టిన మక్కలు, వడ్లు తడిసిముద్దయ్యాయి. మామిడి కాయలు నేలరాలాయి.
- పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, తీగలు తెగి కరంటు సరఫరా నిలిచిపోయింది. చెట్లు రోడ్లపై విరిగి పడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని బోజెర్వు గ్రామం, హనుమకొండలోని హౌసింగ్ బోర్డు, నందిహిల్స్ కాలనీలు జలమయమయ్యాయి. పిడుగుపడి ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో రైతులకు సంబంధించిన బర్రెలు మేకలు కోళ్లు పిడుగు పడి రైతులు కూడా మృతిచెందినట్టు తెలిసింది కమలాపూర్ మండలం అంబాలలో ఇండ్లు, పలు రేకుల షెడ్లు నేలమట్టం
వరంగల్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది . పలుచోట్ల రాళ్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నర్సంపేటలో వరద పారింది. కోత దశలో ఉన్న వరి పొలాలు ఈదురుగాలులు, అకాల వర్షంతో నేలకొరిగింది. వడ్లు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన వడ్లు, మక్కజొన్నలు, మిరప కాయలు తడిశాయి. మామిడి కాయలు నేలరాలాయి. నర్సంపేట మండలం గురిజాలలోని అరటితోటలకు వంగిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. పలు గ్రామాల్లోని ప్రధాన రహదారుల్లో చెట్ల కొమ్మలు విరిగాయి. నేలకొరిగాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.