కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: రేషన్ డీలర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు శనివారం గన్నేరువరం తహాశీల్దార్ అనంతరెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ మహేష్ కుమార్ కు డీలర్ల మండల సంఘం వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఊరందరికీ అన్నం పంచే తమకు కడుపు నిండటం లేదంటూ మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.కరోనాలాంటి కష్టకాలంలో ప్రజలందరికీ రేషన్ సప్లై చేసిన తమను పట్టించుకోవడంలో జాప్యం చేస్తోందంటూ వాపోయారు. రేషన్ డీలర్లకు ఇకనుంచి ప్రభుత్వం ప్రతినెలా గౌరవవేతనం ప్రకటించాలని కోరారు. మంత్రి గంగుల కమలాకర్ ఈనెల 22 నా చర్చలకు పిలిచినట్లు తెలిపారు. ఆ చర్చల్లో రేషన్ డీలర్లకు న్యాయం జరుగకపోతె జూన్ 5 తేదీ నుంచి సమ్మె కు వెళ్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మండలం అధ్యక్షుడు బోడ ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చింతల సంపత్, ప్రధాన కార్యదర్శి చాడ బాపి, బిట్ల రమేష్,ఎ. పద్మ, కె.లక్ష్మీ,గాలి అంజయ్య,శంకరాచారి, బాలయ్య, రమేష్, ఆయా గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
