సంగారెడ్డి జిల్లా / అమీన్ పూర్ / బీరంగూడ : బీరంగూడ గుట్ట కమాన్ ప్రాంతంలో కొందరు కబ్జాదారులు 993 సర్వే నంబర్ లో సుమారు 5000 వేల గజాల భూమిని కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని ఆగస్టు 8వ తేదీన రిపోర్టర్ టివి ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఈరోజు అధికారులు కబ్జాదారులు కబ్జాచేసిన స్థలం చుట్టూ కట్టిన ప్రహరీ గోడని కూల్చివేశారు. ఈ విషయం పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ రిపోర్టర్ టివి కి కృతఙ్ఞతలు తెలిపారు.