పల్నాడు జిల్లా మాచర్ల : “ది రిపోర్టర్” టీవీ ముద్రించిన 2023 క్యాలెండర్ ని మాచర్ల మున్సిపల్ కమీషనర్ ఈవి రమణబాబు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రతి పని లోను విజయం సాధించే విధంగా ఉండాలని , అలాగే “ది రిపోర్టర్” వార్తల వెనక వాస్తవాన్ని సమగ్రమైన కథనాలతో అందించేవిధంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు చెరువవుతుందని అన్నారు. ప్రభుత్వం – ప్రజలకు మధ్య వారధి పత్రికలు, న్యూస్ ఛానల్స్ అని, ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువచేయడం లో న్యూస్ ఛానళ్ల పాత్ర ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమం లో లీడ్ క్రాఫ్ట్ డైరెక్టర్ బూదాల మరియమ్మ, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ సభ్యులు వి.శ్యాంప్రసాద్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు కంభంపాటి భాస్కరరావు, అక్షర భారతి సీఈవో పోలేపల్లి ఆనంద్, “ది రిపోర్టర్ టీవీ” రిపోర్టర్ నాగేంద్రబాబు పాల్గొన్నారు.