పల్నాడు జిల్లా కారంపూడి: “ది రిపోర్టర్” టీవీ ముద్రించిన 2023 క్యాలెండర్ కారంపూడి మండల తహసిల్దార్ శ్రీనివాస్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రభుత్వం – ప్రజలకు మధ్య వారధి న్యూస్ ఛానల్స్ అని, ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువచేయడం లో న్యూస్ ఛానళ్ల పాత్ర ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమం లో శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.