హైదరాబాద్ : “ది రిపోర్టర్” ముద్రించిన 2023 క్యాలండర్ ని బుధవారం హైదరాబాద్ ఎస్స్ ఆర్ నగర్ సిఐ సైదులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రతి పని లోను విజయం సాధించే విధంగా ఉండాలని , అలాగే “ది రిపోర్టర్” వార్తల వెనక వాస్తవాన్ని సమగ్రమైన కథనాలతో అందించేవిధంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని సెక్షన్ల ప్రజలకు చెరువవుతుందని అన్నారు. క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్స్ ఆర్ నగర్ సిఐ సైదులు , అడ్మిన్ ఎస్సై బాలరాజ్ , సిటీ క్రైమ్ డెస్క్ ఇంచార్జ్ కిరణ్, రాజేష్, నరేష్, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.