- బాత్రూంలో విద్యార్థి ప్రసవం.. అదే కథన పై స్పందించిన అధికారులు
- ప్రిన్సిపాల్ తో పాటు డిప్యూటీ వార్డెన్ ఏఎన్ఎం సస్పెన్షన్
సంగారెడ్డి :హాస్టల్ బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని అనే శీర్షికతో బుధవారం ద రిపోర్టర్ టీవీ లో ప్రచురితమైన కథనంపై జిల్లా మైనార్టీ గురుకుల కళాశాల కార్యదర్శి షఫీయుల తీవ్రంగా స్పందించారు. హాస్టల్ ప్రిన్సిపాల్ తో పాటు డిప్యూటీ వార్డెన్, స్టాఫ్ నర్స్ సునీతను సస్పెండ్ చేశారు. గత నెల 24న సిర్గాపూర్ మండల పరిషత్ కార్యాలయం వెనకాల ముండ్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు ముండ్ల పదుల పడేసి వెళ్లారు. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిర్గాపూర్ ఎస్ఐ నారాయణ అక్కడికి చేరుకొని పసుపు అందుకు నారాయణఖేల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం సంగారెడ్డి లోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. గత నెల 24న ముళ్లపదలో పడేసిన పసిపాప ఎవరు అనేదానిపై విచారణ చేయగా నాందేడ్ పట్టణంలోని మైనార్టీ సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపిసి చదువుతున్న విద్యార్థిని ప్రసవించిన పాపని ముండ్లపదలో పడవేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు వారు నుంచి వివరాలు సేకరించి ఉన్నత అధికారులకు నివేదిక అందజేశారు. ఈ విషయం బయటపడకుండా హాస్టల్ ప్రిన్సిపాల్ తో పాటు సిబ్బంది నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఎలాంటి చిరకు తీసుకోకుండా ప్రయత్నించారు. కానీ బుధవారం ఇక రిపోర్టర్ టీవీ ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడంతో హాస్టల్ లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిపై వేటు వేశారు.