అల్లూరి జిల్లా,మారేడుమిల్లి, ది రిపోర్టర్ న్యూస్ : గిరిజనుల బతుకులకు రహదారి మార్గాలు శాపంగా మారాయి. అల్లూరి జిల్లా కొయ్యురు మండలం మఠం భీమవరం పంచాయితీ పరిధిలోని గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఆకుమామిడి కోట నుంచి పోతవరానికి సుమారు15 కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలుగా ఏర్పడి ప్రమాదకరంగా మారిందని, ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు అధ్వాన్నంగా తయారై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదనను వ్యక్తం చేసారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిపుత్రులు కోరుతున్నారు.
