పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో శ్రీ హరి హర అభయాంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. పుజారులు పోతులూరి వీర భ్రహ్మ స్వామి, పోతులూరి మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వేముల పూర్ణయ్య , ఆంజనేయ స్వామి భక్త బృదం, ఆలయ కమిటీ సభ్యులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.