పల్నాడు జిల్లా మాచర్ల: 30, 31 వార్డుల నందు ప్రభుత్వ పాఠశాల దగ్గర చుట్టుపక్కల ఉన్న టింబర్ డిపోలు తొలగించాలని బహుజన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి మధు మున్సిపల్ కమీషనర్ కి వినపత్రం చేశారు.
వివరాల్లోకి వెళితే ప్రభుత్వ పాఠశాల చుట్టుపక్కల ఉన్న టింబర్ డిపోల వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, మధ్యాహన భోజన సమయంలో టింబర్ డిపో పనుల వలన చక్క పొట్టు, దుమ్మూ, ధూళి వలన భోజనాలు చేయలేకపోతున్నారని, చెక్క పొట్టు తినే ప్లేట్ లో పడడం వాటి వలన విద్యార్థులు అనారోగ్య బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే టింబర్ డిపో శబ్దాల వలన విద్యార్థుల చదువులకు ఇబ్బందికరంగా ఉందని, రోడ్ల పై చెక్క దిమ్మలు విపరీతంగా పడేస్తున్నారని దానివల్ల వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని, ఊరు బయట ఉండాల్సిన టింబర్ డిపోలు, నివాసాల ప్రాంతాల్లో అలాగే, పాఠశాలకు దగ్గర్లో ఉండడం వలన స్థానికులకు అలాగే విద్యార్థులకు ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని టింబర్ డిపోలను తొలగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కమీషనర్ తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన పోరాట సమితి సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.