- ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలయ్యాయి
- ట్రావెల్స్ కి చెందిన బస్సు వేగంగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం “మాదారం టౌన్ షిప్” చెందిన సెంట్ థెరిస్సా పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చేందుకు పాఠశాల వ్యాన్ వచ్చింది. సెంటర్ నుంచి విద్యార్థులను ఎక్కించుకుని వస్తున్న వ్యాన్ పోస్టాఫీస్ దాటగానే విద్యార్థుల కోసం డ్రైవర్ ఆపాడు. దీంతో వెనకాలే వస్తున్న ట్రావెల్ బస్సు దీనిని గమనించకుండా వెనకనుండి ఢీ కొట్టడం జరిగింది. స్కూల్ వ్యాన్ ని వెనక నుంచి ఢీకొట్టడంతో అద్దాలు పగిలి విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు వేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు వెల్లడించారు.