కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రామ శివారులో ఉన్న పోచమ్మ దేవాలయం దగ్గర పెద్దమ్మ ఆలయంలో భారీ చోరి జరిగింది. ఉదయం గుడి పూజారి సమ్మయ్య దేవాలయం వద్దకు చేరుకొని రోజువారిగనే ఆలయం శుభ్రపరుస్తుండగా గుడి తలుపులు ఉన్న తాళం ధ్వంసమై ఉండడంతో పాటు పెద్దమ్మ విగ్రహం పై ఉన్న పుస్తెలు ముక్కుపుడక నక్లేస్ రెండు తులాల బంగారం గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించినట్లు గుడి పూజారి తెలిపారు. పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు