నిజామాబాద్ నగరంలోని సాయి రెడ్డి పెట్రోల్ బంక్ వద్ద గల భగత్ సింగ్ వర్ధంతి పునస్కరించుకొని విగ్రహానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ ఇంచార్జ్ బుస్సాపూర్ శంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు, వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయులు సుఖ్ దేవ్, రాజ్ గురు, భగత్ సింగ్ లు అమరులయిన రోజు ఈ రోజు… వారి బలిదానాలను స్మరించుకుంటూ, వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ తెలిపారు. అదేవిధంగా స్వతంత్రం కోసం బ్రిటిష్ వారికి నిద్ర లేకుండా చేసిన యువ వీర కిశోరాలు సుఖదేవ్, భగత్ సింగ్ మరియు రాజ్ గురు. “ఇన్కలాబ్ జిందాబాద్” అనే నినాదం వీరితోనే పుట్టిందన్నారు. భారత మాత కోసం ఉరికోయ్యల్ని ముద్దాడి నవ్వుతూ “మేరా రంగ్ దే బసంతీ చోలా” అంటూ తమ రక్తం తో హోలీ జరిపిన ఈ భారత మాత ముద్దు బిడ్డలు చనిపోయి జీవించడం అంటే ఏంటో చూపించారన్నారు. వీరి త్యాగాలని సంస్మరించుకుంటూ, ఆ స్పూర్తితో మనం కూడా దేశ భక్తిని ని గుండెల్లో నింపుకుందామన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభగం అధ్యక్షులు అంకార్ గణేష్ , పార్టీ నగర అధ్యక్షులు కస్తూరి ప్రవీణ్ , నగర పార్టీ ప్రధాన కార్యదర్శి కుంచెపు ఆనంద్ , నగర బీసీ విభాగం అధ్యక్షులు కారంపూరి రవి కుమార్ , నగర యువజన విభాగం అధ్యక్షులు సంతోష్ , సాగర్ , సాయి రాం మహిళ నాయకులు రేఖ , రాణి తదితరులు పాల్గొన్నారు