- మిస్సింగ్ పిర్యాదు అందిన 2 గంటల్లో సాంకేతికత ఆధారంగా కేసును చేధించిన సిరిసిల్ల పోలీసులు
- మారుతి కంపెనీకి చెందిన జెన్ కార్
- ఒక మొబైల్ ఫోన్
- 20 వేల రూపాయలు
- నేరమునకు సంబధించిన ఇతర వస్తువులు స్వాధీనం
- జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సుభాష్ నగర్ కి చెందిన కాశయ్య అనే వ్యక్తి గత కొద్ది రోజుల నుండి త్రాగటానికి అలవాటుపడి, తన భార్య అయిన కనుకవ్వ ను అనుమానిస్తూ మాటలతో తరచూ వేధిస్తూ ఉండేవాడు, అట్టి వేదింపులు భరించలేక,కనుకవ్వ వరుసకు తనకు తమ్ముడు అయిన నర్సయ్య కు తన భర్త వేదించే విషయాన్ని చెప్పి, అతన్ని ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు ఎలాగైనా చంపమని చెప్పగా అందుకు నర్సయ్య 3 లక్షల రూపాయలు తీసుకొని తన స్నేహితుడు అభిలాష్ కు విషయం చెప్పి అతనికి 50,000/-రూపాయలు ఇస్తా అని ఒప్పించి ,వారు అనుకున్న పథకం ప్రకారం తేదీ:13.07.2023 గురువారం కనుకవ్వ,నర్సయ్య, అభిలాష్ లు కలిసి రాత్రి అందాజ 11 గంటల ప్రాంతంలో కాశయ్య తన ఇంట్లో పడుకుని ఉండగా,అతని నోరు మూసి మెడకు దుప్పటినీ బిగించి గట్టిగా గుంజగా కాశయ్య చనిపోయినాడు.కాశయ్య మృత దేహాన్ని అభిలాష్ తనకున్న కారులో, నర్సయ్య, అభిలాష్ లు వేసుకొని అక్కడనుండి నెహ్రూనగర్ అంభా బాయి గుడి దగ్గరలో గల చెక్ డ్యామ్ వద్ద మానేరు వాగులో పార సహాయముతో గొయ్యి తీసి శవాన్ని అందులో వేసి పాతి పెట్టి ఎవరికి కనబడకుండా ఇసుక కప్పివేశారు.బుదవారం తేదీ: 02.08.2023 రోజున మృతుని స్వంత తమ్ముడు అయినటువంటి సిద్దిపేట జిల్లా రామంచ గ్రామానికి చెందిన రాందాని ఎల్లయ్య అనే అతను తన అన్న అయిన రాందాని కాశయ్య గత 15 రోజులుగా కనిపించడం లేదని ఇట్టి విషయములో తన వదిన అయినటువంటి రాందాని కనకవ్వ పై అనుమానం ఉన్నదని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇట్టి ఫిర్యాధు పై మ్యాన్ మిస్సింగ్ కేసు నమోధు చేసిన పోలీస్ వారు దర్యాప్తు లో భాగంగా ఇట్టి కేసును సాంకేతికత ఆధారంగా 02 గంటల్లో ఛేదించి ముగ్గురు నిందితులను నిన్నటి రోజున సాయంత్రం తంగాల్లపల్లి లో,గాంధీ నగర్ లో ,సిరిసిల్ల బైపాస్ లో పట్టుకొని విచారించగా అట్టి నేరం తామే చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగిందన్నారు.అనంతరం ముగ్గురు నిందితులను రిమాండ్ కి తరలించడం జరిగిందని తెలిపారు.ఈ కేసు చేదనలో కృషి చేసిన సిరిసిల్ల డిఎస్పీ ఉదేయ్ రెడ్డి , టౌన్ సి. ఐ ఉపేందర్ ,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీకాంత్,జనార్దన్,గోపాల్ లను అభినందించి క్యాష్ రివార్డు అందజేసిన జిల్లా ఎస్పీ.