కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడటంతో కొత్త శ్రీనివాస్ స్వప్న కు చెందిన ఇల్లు ధ్వంసం అయింది. సోమవారం రాత్రి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో కొత్త శ్రీనివాస్ ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే మరొక రూమ్ లో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగుపాటుతో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడి గ్రామంలో చిమ్మటి చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో షాక్ నుంచి తేలుకున్న కుటుంబ సభ్యులు మా ఇంటి పైన పిడుగు పడిందని తెలుసుకున్నారు. తెల్లవారుజామున వరకు వర్షానికి ఆ ఇంటిలోనే భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ప్రజా ప్రతినిధులు, అధికారులను కోరుతున్నారు.