అర్ధవీడు మండలంలో తాజాగా పులి సంచారం కలకలం రేపింది. నీటి కోసం నల్లకొండ దిగి నాగులవరం – మొహిద్దీన్ పురం రహదారి దాటుకుని దాహం తీర్చుకోవడానికి కంభం చెరువులోకి వెళ్తున్న పులిని కొందరు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. దాహం తీర్చుకుని మళ్లీ వెలిగొండ ప్రాజెక్ట్ తూర్పు ప్రధానకాలువ మీదుగా నల్లకొండ ఎక్కివెళ్లిన ఆనవాళ్లను గుర్తించారు. గ్రామస్థుల సమాచారంతో అటవీశాఖ అధికారులు పులి వేలిముద్రలు సేకరించారు.