కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన పడాల సౌజన్య గౌడ్ ని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం తిమ్మాపూర్ మండల మహిళ అధ్యక్షురాలుగా నియమిస్తూ కరీంనగర్ జిల్లా సర్వాయి పాపన్న మోకు దెబ్బ జిల్లా అధ్యక్షురాలు వడ్లకొండ అరుణ గౌడ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు, కరీంనగర్ పట్టణంలోని సర్వాయి పాపన్న మోకు దెబ్బ కార్యాలయంలో నియమక పత్రాన్ని జిల్లా అధ్యక్షురాలు అరుణ గౌడ్ అందజేశారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కె వీరస్వామి గౌడ్, జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన అధ్యక్షురాలు సౌజన్య మాట్లాడుతూ గీత కార్మికుల హక్కుల కొరకు పోరాటం చేసి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో కిషన్ గౌడ్, పాల్గొన్నారు.
