- తెగిపోయిన కుంటను పరిశీలించిన ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల 100 ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరందించే తిమ్మసికుంట కు భారీగా గండి పడగా అట్టి కుంటను స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ గురువారం పరిశీలించారు. తిమ్మసికుంట వద్ద శాశ్వత పరిష్కారం కోసం వంతెన నిర్మించాలని ఇరిగేషన్ ఏ.ఈ కృష్ణకాంత్ ను ఆమె కోరారు. అదే విధంగా నీట మునిగి నష్ట పోయిన వరి పొలాలకు సంబంధించిన రైతులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని సర్వే చేయాలని మండల వ్యవసాయ అధికారి భుమ్ రెడ్డిని కోరారు.అదే విధంగా తిమ్మసికుంట వద్ద అంత్యంత ప్రమాదకరం గా ఉన్న విద్యుత్ స్తంభాన్ని పరిశీలించి కొత్త విద్యుత్ స్తంభము ఏర్పాటు చేయాలని సెస్ ఏ.ఈ పృథ్విదర్ ను ఆమె కోరారు. అదే విధంగా తిమ్మస్ కుంట తెగి రెండవ బై పాస్ రోడ్ వద్ద ఉదృతంగా నీరు రోడ్డు పై నుండి పోతుండటంతో కోతకు గురైన రోడ్డు పక్కన గల విద్యుత్ స్తంభం కింద పడిపోయే పరిస్థితి ఉందని ఒక వేళ కింద పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సెస్ ఏ.ఈ పృథ్విదర్ ను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కోరగా విద్యుత్ సరఫరా నిలిపివేసి స్థంభము కింద పడకుండా సెస్ ఏ.ఈ సరిచేయించారు. శిథిలావస్థకు చేరుకున్న ముద్దం నడిపి ఎల్లయ్య ,బీపేట మల్లవ్వ ఇండ్లు కూలీపోయే పరిస్థితి లో ఉన్న ఇండ్లను పరిశీలించి సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనకు సంబందించిన ఫంక్షన్ హాలు లో ఉండాలని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వారికి సూచించారు.వీరి వెంట పంచాయతీ కార్యదర్శి దేవరాజ్,వార్డు సభ్యులు న్యాలకంటి దేవేందర్,గ్రామ పంచాయతీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ కటకం రామచంద్రం ఉన్నారు.