- తిరుమల కొండపైన పిఆర్ఓ ల పేరుతో దందా చేస్తున్న వైసిపి మూకలను తరిమికొట్టండి … టీటీడీ అడిషనల్ ఇఓ వెంకయ్య చౌదరి కి ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు
తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఇఓ వెంకయ్య చౌదరి ని కలిసి ఎదుర్కొంటున్న పలు సమస్యలను విన్నావించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల ప్రైవేట్ హోటల్స్ లో అధిక ధరలకు నాసిరకం భోజనాలు విక్రయించడం. ధరల పట్టిక ఏర్పాటు చెయ్యడం , తిరుమలలోని వివిధ ప్రైవేట్ మఠాల ఆగడాలు , అధిక దోపిడీ, మ్యారేజ్ కాంట్రాక్టుల పేరుతో దందాలు మొదలైన సమస్యలు , తిరుపతి గోశాల నందు గోవులకు నాసిరకంగా అందిస్తున్న ఫీడ్ మరియు ఇతర సమస్యల పైన, ప్రైవేట్ అతిథి గృహాల నందు సామాన్య భక్తులకు వసతి కల్పించాలని, సౌకర్యాలను మెరుగుపరచాలని, విన్నవించడం జరిగిందన్నారు. గత వైఎస్ పాలనలో టిటిడి ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాలను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడం వలన వారు టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా, ప్రైవేట్ కార్యక్రమాలకు అనుమతించడం జరిగిందన్నారు. ఆ లీస్ అగ్రిమెంట్ ను రద్దు చేసి, నియంత్రించాలని కోరడమైదన్నారు. కొండపైన స్వామివారి దర్శనానికి విఐపి లు అందిస్తున్నటువంటి దర్శనం టికెట్లు దుర్వినియోగం అవుతున్నాయని కొందరు పిఆర్ఓల పేరుతో తిరుమల లో తిష్ట వేసి దళారులుగా అవతారం ఎత్తి భక్తుల దగ్గర నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ,దీని నియంత్రించాలని అడిషనల్ ఇఓ వెంకయ్య చౌదరి నీ కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్త గిరి ప్రసాద్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి శేషాద్రి నాయుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ కృష్ణమూర్తి, లీగల్ సెల్ విభాగం కార్యదర్శి అంజన్ సింగ్, అలిపిరి రవి తదితరులు పాల్గొన్నారు.