తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, ఊట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరి పై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 76వ ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, కోలాటాల నడుమ హరోం హర అంటూ…చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు ఎమ్మెల్యేలకు అందించి, వేద పండితుల మంత్రోచ్ఛారణతో ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో పాకాల మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బోయపాటి నాగరాజు నాయుడు, ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, పాకాల మండలం జడ్పిటిసి నంగ పద్మజా రెడ్డి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు ఈశ్వర్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కొత్తపల్లి గౌతమ్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సావిత్రి, ఊట్లవారిపల్లి బుజ్జి, పాకాల గ్రామ కమిటీ అధ్యక్షులు మోహన్ నాయుడు మండల నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.