తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరి పై వెలసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి 76వ ఆడికృతిక బ్రహ్మోత్సవాలలో మంగళవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని అందించారు. మంగళవారం పాలకావడికి పాలాభిషేకం, స్వామివారి కల్యాణోత్సవం, ఉంజలసేవ, పుష్ప పల్లకి కార్యక్రమాలు నిర్వహించారు.