తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీ రామకృష్ణ మందిరం వీధికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఇ.కామేశ్వర్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మీడియా మిత్రులు, సిపిఎం, కెవిపిఎస్ నాయకులు కలిసి సీనియర్ జర్నలిస్ట్ ఇ.కామేశ్వర్ చిత్రపటానికి పూలమాలవేసి,నివాళులు అర్పించి సంతాపం తెలియజేశారు. . ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మధుసూదన్ రావు మాట్లాడుతూ ఆయన సిపిఎం పార్టీలో కొనసాగుతూ విలేకరిగా పనిచేస్తూ సమాజానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు, సిపిఎం, కెవిపిఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు