తిరుపతి జిల్లా, పాకాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం తహసీల్దార్ నిత్యానంద బాబు మండల పరిధిలోని అన్ని సచివాలయాల బీఎల్వోలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ మాట్లాడుతూ ఆగస్టు 20వ తారీకు నుంచి గ్రామ పరిధిలో ఇంటింటికి నూతన ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా బీఎల్వోలు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు విధి విధానాలపై దిశా నిర్దేశం చేసారు. అదేవిధంగా బిఎల్వోలు ఎమ్మార్వో దృష్టికి పలు సమస్యలు తీసుకొనిరాగ. ఇందులో ప్రధానంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ప్రధాన ఎన్నికల్లో విధులలో పాల్గొన్న బీఎల్వోలు, మూడేళ్లుగా పనిచేసినా ఎలాంటి గౌరవ వేతనం అందుకోలేదన్నారు. ఎన్నికలకు కూడా భత్యం చెల్లించలేదన్నారు. బిఎల్వోలకు అందదవలసిన వేతనాలు అందే విధంగా చూడాలన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించే లా తాను ప్రయత్నం చేస్తానని తహసీల్దార్ తెలిపారు.