తిరుపతి జిల్లా, పాకాల మండల కేంద్రంలో అన్ని పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థులతో కలిసి పాకాల మండల పరిధిలో భారీ జాతీయ పతాకంతో ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు మండలంలోని అన్ని విధులలో తిరుగుతూ ర్యాలీ నిర్వహించారు. పాకాల మండల ప్రజా పరిషత్, తహసీల్దార్ కార్యాలయం, మండలంలోని స్కూల్లో జాతీయ పతకాన్ని ఎగురవేసి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులకు నివాళులర్పించి, స్మరించుకున్నారు. గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి లోకనాధం జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి, ఎమ్మార్వో నిత్యానంద బాబు, ఎంపీడీవో ప్రభాకర్, సబ్ ఇన్స్పెక్టర్ మహేష్, పిఓపిఆర్డి మాలతి, వివో ఆర్ డి మోతి, ప్రధానోపాధ్యాయులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సెక్రటరీలు, స్కూల్ చైర్మన్ వార్డు నెంబర్లు నాయకులు కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు