తిరుపతి :శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ఈరోజు వెంకటేశ్వర స్వామి పటాలు నెత్తిన పెట్టుకొని హోమం చేయడం జరిగింది. గోవిందా గోవిందా అంటూ నినదీస్తూ మా సమస్యను పరిష్కరించండి అని నినదించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ నేటికి నాలుగు రోజులు పూర్తవుతున్న టిటిడి యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనేక సార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదన్నారు. రాత్రింబవులు నిరసన దీక్షలో కూర్చొని దోమల లెక్కచేయకుండా అనారోగ్యానికి గురవుతున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. శ్రీవారి మెట్లు మార్గంలో నడుస్తున్న భక్తులకు అండదండలుగా ఉన్న శ్రీవారి మెట్లు వ్యాపారస్తులను దించేయడం సరైన పద్ధతి కాదు అన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఆ మార్గంలో వెళుతున్న భక్తులకు అనేక రూపాలుగా సేవలు చేయడం జరిగిందన్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు వెంకటేశ్వర స్వామి మా మీద మంచి దయ చూపమని ఈవో గారికి జేఈఈఓ గారికి చెప్పాలని హోమం చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి, నరసింహ, మళ్లీ, సోను, మొగిలి, అప్ప రాంబాబు, గణేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు..