తిరుపతి జిల్లా, పాకాల మండలం లోని పాకాల మరియు దామలచెరువు ప్రైమరి హెల్త్ సెంటర్ నందు మంగళవారం హాస్పిటల్ అభివృద్ధి కమిట సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు హాస్పిటల్ నిర్వహణ కు అవసరమైనా నిధుల గురుంచి (పరిసరాల పరిశుభ్రత ) పిచ్చి మొక్కలు తొలగించడం మరియు హాస్పిటల్ పరిశుభ్రత ‘ హాస్పిటల్ నందు బెడ్స్, బెడ్ షీట్స్ శుభ్రం చేయుటకు దోబీ, కంప్యూటర్స్ మరియు ప్రింట్స్ ఖర్చుల గురించి చర్చించారు.
ఈ సమావేశంలో ఎంపీపీ లోకనాథం, జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి, ఎంపీడీవో ప్రభాకర్, దామలచెరువు సర్పంచ్, పాకాల మెడికలఆఫీసర్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ రవిరామ్ పాల్గొన్నారు.