తిరుపతి జిల్లా, పాకాల మండలం నేండ్రగుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. క్లీనర్ గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రుడిని అంబులెన్స్ ద్వారా రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పాకాల సిఐ మద్దయ్య ఆచారి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.