తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, రంగంపేట మోహన్ బాబు యునివర్సిటీ లో విద్యార్థులు తిరుగుబాటు చేశారు. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఘోరమైన పద్దతులతో విద్యార్థుల్ని పీడించుకు తింటున్నారని ఏఐసీటీఈకి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా.. బిల్డింగ్ పీజని.. అనేక రకాల ఫీజులు పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు పిండుకుంటున్నారన్నారు. కాలేజీలో డే స్కాలర్స్ గా చదివేవారు కూడా క్యాంటీన్లోనే డబ్బులు కట్టి తినాలని షరతులు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
అవసరం లేకపోయినా విద్యార్థుల చేత బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేపిస్తున్నారని.. యాజమాన్యం చెప్పినట్లు విద్యార్థులు వినకపోతే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని చదువులు చెబుతున్నారని విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్‌కు సరైన సమయానికి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఏఐసిటిఈకి ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థుల తల్లిదండ్రులంతా పేరెంట్స్ కమిటీగా ఏర్పడి ఈ ఫిర్యాదులు చేశారు. మోహన్ బాబుకు విజయవంతమైన వ్యాపారం ఎంబీ యూనివర్సిటీనే అన్నట్లుగా మారింది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఫీజులు పిండుకుంటున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. తాము చాలా మందికి ఉచిత చదువులు చెబుతున్నామని అంటారు కానీ.. వారి జాబితా ఎక్కడా కనిపించదనే విమర్శలు ఉన్నాయి.