- రూ. 3.10 లక్షలు పలికిన లడ్డు
- పూజలు చేసిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్. మౌర్య
తిరుపతి నగరపాలక సంస్థలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్. మౌర్య, కార్పొరేటర్ ఆర్. సి. మునికృష్ణ తదితరులు ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి వద్ద ఉంచిన లడ్డు వేలం పాట నిర్వహించారు. పోటా పోటీగా జరిగిన ఈ వేలం పాటలో ఇంజినీరింగ్ విభాగం వారు 3.10 లక్షల రూపాయల హెచ్చు పాటపాడి లడ్డును దక్కించుకున్నారు. ఇంజినీరింగ్ విభాగపు అధికారులకు మేయర్, కమిషనర్ లడ్డును అందజేశారు. ఈ సందర్బంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఐదు రోజులు పాటు ఘనంగా పూజలు నిర్వహించామని అన్నారు. ఐదవ రోజైన బుధవారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ప్రజలు అందరూ జాగ్రత్తగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని, అందరూ సుఖసంతోషాలతో జీవించాలని అన్నారు. మునిసిపల్ కార్యాలయం నుండి ఊరేగింపుగా వెళ్లి వినాయక సాగర్ లో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన వేడుకల్లో కార్పొరేటర్ ఆర్.సి. మునికృష్ణ, అదనపు కమీషనర్ చరణ్ తెజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, డి.ఈ. విజయకుమార్ రెడ్డి, సెక్రటరీ రాధిక, డి.సి.పి. శ్రీనివాసులు రెడ్డి, ఆర్.ఓ.లు సేతుమాధవ్, కె.ఎల్.వర్మ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మేనేజర్ చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.